తెలంగాణ

BRS పార్టీ పునర్వ్యవస్థీకరణ: KTR కు సిటీ, హరీష్ రావుకు రూరల్ జిల్లాల బాధ్యత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
BRS పార్టీ పునర్వ్యవస్థీకరణ: KTR కు సిటీ, హరీష్ రావుకు రూరల్ జిల్లాల బాధ్యత
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

BRS చీఫ్ KCR తెలంగాణలో పార్టీ పునర్వ్యవస్థీకరణకు కొత్త ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణను రెండు భాగాలుగా విభజించి ఇద్దరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. కొత్త కమిటీల ఏర్పాటు, membership drive, నియోజకవర్గ ఇంచార్జీల నియామకం, పార్టీ శిక్షణ తరగతులను KTR స్వయంగా పర్యవేక్షిస్తారు. రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున review నిర్వహిస్తారు.

తెలంగాణ rural జిల్లాల బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారు. పల్లెల్లో పార్టీని పటిష్టం చేసేందుకు హరీష్ రావు విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు తిరిగి వచ్చిన తర్వాత rural పర్యటనలు వేగవంతం చేయనున్నారు.

రాబోయే ఎన్నికల్లో BRS ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యూహం రూపొందించారని KCR పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్ణయించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com