పలమనేరులో జైలు శాఖ పెట్రోల్ బంక్ నుంచి యావజీవ ఖైదీ సూరి పరార్
చిత్తూరు జిల్లా పలమనేరులో జైలు శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ నుంచి యావజీవ ఖైదీ సూరి పరారయ్యాడు. సూరి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. సత్ప్రవర్తన కలిగిన నలుగురు ఖైదీలతో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంక్ నుంచి సూరి పరారయినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూరిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com