బంగాళాఖాతంలో 13న అల్పపీడనం.. 14, 15 తేదీల్లో అలల ఉద్ధృతి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ఈ అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. సముద్రం కాస్త rough గా ఉండే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగం నమోదు కావచ్చు.
ఈ సమయంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
ప్రస్తుతం ఇది అల్పపీడన దశలోనే ఉంది. బలమైన అల్పపీడనంగా మారిన తర్వాత దీనికి వాయుగుండంగా మారడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడే ఇది ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది, తుఫానుగా మారుతుందా అనే అంచనాకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రాథమిక దశలో ఉన్నందున తుఫానుకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు ఇప్పటివరకు జారీ చేయలేదు.
వాతావరణ శాఖ అధికారులు దీని కదలికలను గమనిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ వ్యవస్థపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com