జాతీయం

మెగ్నీషియం, మెలటోనిన్ సప్లిమెంట్లు నిద్ర సమస్యలకు మేలు చేస్తాయా? నిపుణుల స్పష్టత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మెగ్నీషియం, మెలటోనిన్ సప్లిమెంట్లు నిద్ర సమస్యలకు మేలు చేస్తాయా? నిపుణుల స్పష్టత
📷 David Dibert / Pexels
షేర్ కాపీ అయింది ✓

నిద్ర సమస్యలతో బాధపడేవారు ఇటీవలి కాలంలో మెగ్నీషియం, మెలటోనిన్ సప్లిమెంట్లను విపరీతంగా వాడుతున్నారు. అయితే వీటి వాడకంపై ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేశారు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శరీరంలో 300కుపైగా కీలక ప్రక్రియల్లో పాల్గొంటుంది. మెదడులో న్యూరాన్ల ఉత్తేజాన్ని నియంత్రించి, కండరాలు, నరాలు విశ్రాంతి పొందేలా చేస్తుంది. మెగ్నీషియం లోపిస్తే మెదడు ‘ఆఫ్’ కాలేకపోతుంది. మరోవైపు మెలటోనిన్ ఒక హార్మోన్. ఇది మెదడులోని పైనియల్ గ్రంధి నుంచి ఉత్పత్తి అవుతుంది. శరీర గడియారాన్ని (సర్కాడియన్ రిథమ్) నియంత్రిస్తుంది. రాత్రి సమయం ఆసన్నమైందని మెదడుకు గుర్తు చేస్తుంది. మెలటోనిన్ స్థాయిలు వెలుగు లేనప్పుడు పెరిగి నిద్రకు సిద్ధం చేస్తాయి.

ఈ రెండు సప్లిమెంట్లను ఎవరు తీసుకోవాలన్న విషయంలో నిపుణుల స్పష్టత: మెగ్నీషియం స్థాయిలు సాధారణంగా ఉన్నా కూడా నిద్ర నాణ్యత లేని వాళ్ళు, యాంగ్జయిటీ సమస్యలు ఉన్నవారు, మైగ్రేన్ బాధితులు, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారికి మెగ్నీషియం సప్లిమెంట్లు సిఫారసు చేస్తుంటారు. అయితే మెలటోనిన్ సప్లిమెంట్లు చాలా తక్కువ మందికి మాత్రమే ఉపయోగపడతాయి. జెట్ లాగ్ వంటి స్వల్పకాలిక నిద్ర సమస్యలకు, లేదా నైట్ షిఫ్ట్ కారణంగా కొన్ని రోజులు నిద్ర తప్పినప్పుడు మాత్రమే వీటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సప్లిమెంట్లను డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే వాడాలి. ఇష్టారీతినా తీసుకుంటే అజీర్తి, ముఖ్యంగా వృద్ధులలో పగటిపూట నీరసం వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన నిద్రకు జీవనశైలి మార్పులే ప్రాధాన్యం. మెగ్నీషియం, మెలటోనిన్ సప్లిమెంట్లు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడినా, వాటిని ‘టాఫీ’లా పాప్ చేయడం సరైనది కాదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com