పాలపుంత గ్యాలక్సీలో 'మాగ్నటిక్ ట్విస్ట్': కెనడా శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ శాస్త్రవేత్తలు పాలపుంత గ్యాలక్సీలో అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. ప్రొఫెసర్ జో-ఆన్ బ్రౌన్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన చేసింది.
గ్యాలక్సీ అంతటా అయస్కాంత క్షేత్రం clock-wise దిశలో ప్రవహిస్తుంది. అయితే Sagittarius Arm అనే ప్రత్యేక ప్రాంతంలో మాత్రం అది counter clock-wise దిశలో ప్రవహిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే గ్యాలక్సీలో రెండు వేర్వేరు దిశల్లో అయస్కాంత ప్రవాహం ఉండటం ఇది అసాధారణమైన విషయం.
కెనడా నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ నడిపే radio telescope సహాయంతో ఈ పరిశోధన జరిగింది. శాస్త్రవేత్తలు Faraday rotation అనే భౌతిక పద్ధతిని వాడి అంతరిక్షంలోని అదృశ్య అయస్కాంత ధారలను గుర్తించారు. అంతరిక్షం నుండి వచ్చే radio తరంగాలు అయస్కాంత క్షేత్రాల గుండా ప్రయాణించేటప్పుడు వంగిపోతాయి. ఆ వంపుల డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు అయస్కాంత క్షేత్రం దిశను నిర్ధారించారు.
ఈ పరిశోధన ఆధారంగా విశ్వ చరిత్రలో మొదటిసారిగా గ్యాలక్సీ అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన 3D model తయారైంది. రీసెర్చర్ Rebecca Booth ఈ మలుపు వెనక ఉన్న రహస్యాన్ని విశ్లేషించింది. Dr. Anna Ordog అందించిన డేటా ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.
ఈ పరిశోధన వివరాలు The Astrophysical Journal మరియు The Astrophysical Journal Supplement Series లో ప్రచురించబడ్డాయి. కొత్త నక్షత్రాలు ఎలా పుడతాయి, గ్యాలక్సీలు కాలక్రమంలో ఎలా మారుతాయి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ 3D model ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com