తెలంగాణ

కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలన
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పనుల బకాయి బిల్లులు చెల్లిస్తున్నామని, మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పున:ప్రారంభించిందని తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు, జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించి, ఆమోదం తెలపనున్నట్లు మంత్రి వివరించారు.

ఈ నెలాఖరు వారంలో ముఖ్యమంత్రి ఈ కలెక్టరేట్‌ను ప్రజలకు అంకితం చేస్తారని, తెలంగాణ తల్లి విగ్రహం, జాతీయ జెండా ఆవిష్కరణ కూడా చేస్తారని చెప్పారు.

రానున్న రోజుల్లో రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, పెన్షన్లు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను సక్రమంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com