వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి కాదు - వ్యవసాయ శాఖ స్పష్టీకరణ
యాసంగి వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ ఖండించింది. సెల్ఫ్ డిక్లరేషన్ లాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి రైతులకు సూచించారు. వరి విత్తనాల విక్రయానికి ఎలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు.
రైతులను ఒత్తిడి చేసే డీలర్లపైన, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎల్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున యాసంగిలో వరిసాగు తగ్గించుకోవాలని సూచించారు.
వరికి బదులుగా కూరగాయలు, కందులు, పెసర్లు, సజ్జలు వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. చెరువులు, బోర్ల కింద సాగయ్యే భూముల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించే పంటలు సాగు చేయాలని డాక్టర్ బి గోపి సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com