జాతీయం

పార్టీ ఆదేశాలు పాటించాల్సిందే.. SIR విషయంలో CM రేవంత్ రెడ్డి సీరియస్ హెచ్చరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పార్టీ ఆదేశాలు పాటించాల్సిందే.. SIR విషయంలో CM రేవంత్ రెడ్డి సీరియస్ హెచ్చరిక
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల జూమ్ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SIR పథకం విషయంలో పదే పదే చెప్పినా సరిగ్గా స్పందించడం లేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

SIR పథకాన్ని అడ్డుపెట్టుకుని BJP కుట్ర పన్నుతుందని CM హెచ్చరించారు. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని నేతలను హెచ్చరించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకు ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పని చేస్తానని CM రేవంత్ అన్నారు.

SIR అవగాహన సదస్సులపై జిల్లాల వారీగా రిపోర్ట్ తన దగ్గర ఉందని CM రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున SIR పై మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఇంచార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

SIR విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని CM హెచ్చరించారు. పేదల ఓట్లు పోతే వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతాయని అందుకే వారికి అన్యాయం జరగనివ్వబోమని నేతలకు స్పష్టం చేశారు.

పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. SIR పై పార్టీ ఆదేశాలను పట్టించుకోని వారి స్థానంలో మరొక ఇంచార్జ్‌ను నియమిస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని స్పష్టం చేశారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.

10 రోజుల సమయం ఇచ్చి చూస్తామని, పద్ధతి మార్చుకోకపోతే వారినే మార్చేస్తామని CM రేవంత్ రెడ్డి హెచ్చరించారు. SIR పైన గ్రామాల్లో కాంగ్రెస్‌కు చెందిన సర్పంచులతో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com