హైదరాబాద్ 33°C
అమరావతి 36°C
IST 2:18 PM
ఆదివారం జూలై 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

మంచిరాలలో పోలీసుల భారీ తనిఖీలు: 166 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మంచిరాలలో పోలీసుల భారీ తనిఖీలు: 166 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం
📷 Radhika Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

మంచిరాలలో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాలతో 300 మంది ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి.

కాలనీలో కొన్ని ఇళ్లలో రహస్యంగా గంజాయి అమ్ముతూ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ₹20,000 విలువైన అక్రమ మద్యం, సరైన పత్రాలు లేని 166 బైక్లు, ఐదు ఆటోలు, ఒక తల్వార్, రెండు బ్యాట్మింటన్ బ్యాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి రోడ్లపై బర్త్డే కేక్స్ కట్ చేసిన 10 మంది యువకులతో పాటు మరో 10 మంది పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ అనుభవాన్ని పంచుకుని మెరుగైన జీవితం ఇవ్వడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నామని, యువత ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com