హైదరాబాద్ 33°C
అమరావతి 36°C
IST 3:05 PM
ఆదివారం జూలై 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

ముచ్చింతల్ శ్రీరామనగరంలో జూలై 14న సుందరకాండ పారాయణం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ముచ్చింతల్ శ్రీరామనగరంలో జూలై 14న సుందరకాండ పారాయణం
📷 VARAN NM / Pexels
షేర్ కాపీ అయింది ✓

ముచ్చింతల్ శ్రీరామనగరంలో జూలై 14వ తేదీన ఆషాడ అమావాస్య సందర్భంగా ప్రత్యేక సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శ్రీ త్రిదండి అహోబిలం స్వామి ప్రకటించారు.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. సుందరకాండ పారాయణం మానసిక ప్రశాంతత, ధైర్యం, కుటుంబ సౌఖ్యం, భగవత్ భక్తిని పెంపొందిస్తుందని స్వామి తెలిపారు.

108 అమావాస్యల సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ప్రారంభించారు. ఇప్పటికే 13 అమావాస్యలు పూర్తికాగా, ఇది 14వ అమావాస్య కార్యక్రమం. అదే రోజు పునర్వసు నక్షత్రం (శ్రీరామచంద్రుని అవతరించిన నక్షత్రం) రావడం విశేషం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com