రాజస్థాన్‌లో రైతు పొలంలో దాచిన రూ.5 లక్షల నోట్లు చెదపురుగులకు ఆహారం
రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు తన పొలంలో కొంత భాగాన్ని అమ్మగా రూ.5 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక సంచిలో కట్టి, పొలంలో ఒక చోట గుంత తీసి పూడ్చిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత డబ్బు ఎక్కడ పూడ్చారో మరిచిపోయారు.
దీంతో కుటుంబం మొత్తం ఆరు ఎకరాల పొలంలో అనుమానం ఉన్న చోట్ల తవ్వకాలు జరిపినా డబ్బు దొరకలేదు. ఇటీవల విత్తనాలు వేసేందుకు పొలం దున్నుతుండగా, ఆ సంచి బయటపడింది.
కానీ సంచి తెరిచి చూడగా, అందులోని నోట్లను చెదపురుగులు పూర్తిగా తినేశాయి. మిగిలిన కొన్ని నోట్లను తీసుకుని రైతు సమీపంలోని SBI బ్యాంకుకు వెళ్లగా, నోట్లు చెడిపోయాయని బ్యాంకు సిబ్బంది వాటిని మార్చేందుకు నిరాకరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com