విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోలేదు: రజినీకాంత్ క్లారిటీ
నటుడు రజినీకాంత్ TVK చీఫ్ విజయ్‌ను తమిళనాడు సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని చెప్పారు.
తనపై ట్రోలింగ్ జరిగిందని, అందుకే స్పందించానని రజినీకాంత్ వివరించారు. స్పందించకపోతే ఆరోపణలన్నీ నిజమేనని అందరూ అనుకుంటారని మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.
తాను పార్టీ పెట్టి ఉంటే గెలిచేవాడినని అన్నారు. అయితే ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.
DMK చీఫ్ MK స్టాలిన్ తన మంచి మిత్రుడని రజినీకాంత్ అన్నారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత స్టాలిన్‌ను స్నేహపూర్వకంగా కలిశానని, ఆ భేటీకి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పారు.
కమల్‌హాసన్ సీఎం అయితే అసూయ పడతానని సెటైర్ వేశారు రజినీకాంత్. దీనికి నటుడు, MP కమల్‌హాసన్ స్పందించారు. సినిమాల్లో మాత్రమే రజినీకాంత్‌తో పోటీ పడతానని చెప్పారు. తమ మధ్య అసూయ, ద్వేషం ఏమీ లేదని స్పష్టం చేశారు.
20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని కమల్‌హాసన్ తెలిపారు. రజిని, తాను వేర్వేరు పంథాల్లో సాగుతూ స్నేహపూర్వక పోటీతోనే సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నామని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో TVK పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. DMK, Anna DMK కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, రజినీకాంత్‌ని సీఎం చేస్తారని కూడా ప్రచారాలు జరిగాయి. స్టాలిన్-రజినీకాంత్ భేటీ ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com