తెలంగాణ

HYDRAA కమిషనర్ రంగనాథ్ మియాపూర్–బాచుపల్లి వద్ద వరద నీరు పరిశీలించారు; అదనపు పైప్‌లైన్ నిర్మాణం ఆదేశాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
HYDRAA కమిషనర్ రంగనాథ్ మియాపూర్–బాచుపల్లి వద్ద వరద నీరు పరిశీలించారు; అదనపు పైప్‌లైన్ నిర్మాణం ఆదేశాలు
📷 Dogan şimşek / Pexels
షేర్ కాపీ అయింది ✓

HYDRAA కమిషనర్ రంగనాథ్, అడిషనల్ డైరెక్టర్ పాపయ్యతో కలిసి మియాపూర్–బాచుపల్లి ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిన ప్రాంతాన్ని ఈరోజు పరిశీలించారు. బికే ఎన్క్లేవ్ వద్ద నీరు నిలిచేందుకు కారణాలను ఆరా తీశారు.

గతంలో ఏర్పాటు చేసిన పైప్లైన్ సామర్థ్యం సరిపోకపోవడం వల్లే నీరు నిలవడం జరుగుతోందని గుర్తించారు. వెంటనే అదనపు పైప్లైన్ నిర్మించాలని, బుధవారం నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టాటా షోరూం వైపు నుంచి ప్రధాన రహదారి కింద పైప్‌లైన్‌లకు అనుసంధానంగా కూడి చెరువుకు నీటిని మళ్లించే పైప్‌లైన్ పనులు ప్రారంభమయ్యాయి.

ఇంకా, ఓమాల్ నిర్వాహకులు ప్రధాన వరద కాలువపై స్లాబ్ వేయడంతో వరద నీరు సాఫీగా గురునాథ్ చెరువులోకి వెళ్లలేకపోతోందని గుర్తించారు. స్లాబ్‌ను అవసరమైనంత తొలగించి, నీరు సులభంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో వరద సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com