హైదరాబాద్ 27°C
అమరావతి 30°C
IST 2:43 AM
సోమవారం జూలై 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

గాయని ఎస్ జానకి అంత్యక్రియలు మైసూరులో ప్రభుత్వ లాంచనాలతో పూర్తి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గాయని ఎస్ జానకి అంత్యక్రియలు మైసూరులో ప్రభుత్వ లాంచనాలతో పూర్తి
📷 Tima Miroshnichenko / Pexels
షేర్ కాపీ అయింది ✓

గాయని ఎస్ జానకి (85) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం మైసూరు సమీపంలోని కల్యాణ హుండి ఫార్మ్ హౌస్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

జానకి మనవరాలు వైద్యురాలు అప్సర ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. ఆమె భౌతిక కాయాన్ని బంగారు అంచు తెల్ల చీర, వివిధ రంగుల పూలతో అలంకరించారు. జానకి కుడి చేతిలో ఆమెకు ఇష్టమైన శ్రీకృష్ణుడి ప్రతిమను ఉంచారు.

2008 నుంచి మైసూరులోనే నివసిస్తున్న జానకి, తన చివరి సంస్కారాలు అక్కడే జరగాలని కోరుకున్నారు. ఆమె ఈ కోరిక మేరకు కుటుంబ సభ్యులు మైసూరులోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా పోలీస్ గన్‌ సెల్యూట్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి యతీంద్ర సిద్దరామయ్య హాజరయ్యారు. మైసూరు ప్రజలు జానకికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిందేనని మంత్రి తెలిపారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com