జాతీయం

సంజయ్ జాజు తెలంగాణ కొత్త CS గా నియామకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సంజయ్ జాజు తెలంగాణ కొత్త CS గా నియామకం
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకమయ్యారు. ఆయనను CS గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తరవులు జారీ చేసింది. 1992 IAS బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ IAS అధికారి అయిన సంజయ్ జాజు మూడు రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగబోతున్నారు.

ఇప్పటివరకు సంజయ్ జాజు కేంద్ర ప్రభుత్వంలో తూర్పు రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఆయనను పేరెంట్ క్యాడర్కు బదిలీ చేసింది. ప్రస్తుత CS కే. రామకృష్ణరావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో సంజయ్ జాజును తదుపరి CS గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సంజయ్ జాజు కీలక బాధ్యతలు నిర్వహించారు. విజయవాడ సబ్ కలెక్టర్ గా, పశ్చిమ గోదావరి కలెక్టర్ గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా మరియు కమిషనర్ గా, విద్యుత్ సరఫరా సంస్థ కమిషనర్ గా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత సంజయ్ జాజును తెలంగాణ క్యాడర్కు కేటాయించగా, అదే సంవత్సరం డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుకు వెళ్ళారు. 2018 మార్చి వరకు NHIDCL డైరెక్టర్ గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న సంజయ్ జాజును తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం తిరిగి సొంత రాష్ట్ర క్యాడర్కు పంపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com