జాతీయం

పవన్ కళ్యాణ్ లైనప్‌లో షాకింగ్ ట్విస్ట్! OG2 ముందుకు వస్తుందా?

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పవన్ కళ్యాణ్ లైనప్‌లో షాకింగ్ ట్విస్ట్! OG2 ముందుకు వస్తుందా?
📷 Ready 2 Release / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

టాలీవుడ్ వర్గాల ప్రకారం పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన రెండు పెద్ద చిత్రాలు ప్రస్తుతం అనిశ్చిత స్థితిలో పడనున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సీక్వల్ OG2 అనూహ్యంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని సమాచారం. మరోవైపు OG తర్వాత దర్శకుడు సుజిత్ నాని కథానాయకుడిగా బ్లడీ రోమియో అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ నాని ప్రస్తుతం చేస్తున్న ది పారడైస్ మూవీ డిలే కారణంగా బ్లడీ రోమియో వెనక్కి వెళ్ళిపోయింది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ముందుగా OG2 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీక్వల్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం అందుతోంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో అధికారిక ప్రకటన వస్తుందని, నవంబర్ నుంచి OG2 షూటింగ్ ప్రారంభం కానుందని చెప్తున్నారు. అంతేకాకుండా 2027 చివరినాటికి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. OG2 తర్వాత సురేందర్ రెడ్డి సినిమా, నాని బ్లడీ రోమియో వంటి ప్రాజెక్టులు జరుగుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com