హైదరాబాద్ 27°C
అమరావతి 33°C
IST 10:17 AM
బుధవారం ఆగస్టు 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వ్యాపారం

శ్రావణ మాసంలో 10,000 పెండ్లిళ్లు, వంద కోట్ల రూపాయల వ్యాపారం అంచనా

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శ్రావణ మాసంలో 10,000 పెండ్లిళ్లు, వంద కోట్ల రూపాయల వ్యాపారం అంచనా
📷 Tolga Aslantürk / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆషాడం ముగియడంతో రాబోయే రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసాన్ని పెండ్లిళ్లకు ప్రశస్తమైన సమయంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 వివాహాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆషాడంలో పెండ్లిళ్లు వాయిదా పడిన కారణంగా ఈ నెల రోజుల పాటు ఫిక్స్ చేసుకున్న సంబంధాలు శ్రావణం ప్రారంభం కాగానే జరగనున్నాయి. ఈ నెల 14 వరకు పెండ్లిళ్లకు అనుకూల ముహూర్తాలు ఉన్నాయని పౌరోహితులు చెప్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.

పెండ్లిళ్ల సీజన్‌తో పలు రంగాలకు భారీ డిమాండ్ వచ్చింది. నగల దుకాణాలు, బట్టల షాపులు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్లు, ఫొటోగ్రాఫర్లు, బ్యూటీ పార్లర్లు, మేకప్ ఆర్టిస్టులు, బ్యాండ్ బృందాలు, క్యాటరింగ్, వడ్డన సిబ్బంది, ట్రావెల్స్, డ్రైవర్లతో సహా ఎన్నో రంగాలకు ఈ సీజన్ కీలకంగా మారింది.

బంగారం ధరలు తులానికి లక్ష రూపాయల పైనే ఉన్నప్పటికీ వివాహాల్లో నగల కొనుగోలు తప్పనిసరి కావడంతో కొంత మొత్తంలో బేరాలు జరుగుతాయని వర్తకులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మొత్తంగా వంద కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com