హైదరాబాద్ 29°C
అమరావతి 35°C
IST 12:00 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

తెలంగాణలో 13 మంది IAS అధికారుల బదిలీ - కొత్త CS సంజయ్ జాజు టీమ్ ప్రకటన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో 13 మంది IAS అధికారుల బదిలీ - కొత్త CS సంజయ్ జాజు టీమ్ ప్రకటన
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది సీనియర్ IAS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కొత్త CS గా సంజయ్ జాజువను నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత CS రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి సలహాదారు పదవి అప్పగించారు. సుమారు పది సంవత్సరాల పాటు సింగరేణి CMD గా కొనసాగిన N శ్రీధర్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంతకుముందు CMO లో కీలకంగా పనిచేసిన అజిత్ రెడ్డిని అక్కడి నుంచి మార్చి తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ CEO గా నియమించారు.

శైలజ రామయ్యర్‌ను ఎండోమెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, సవ్యసాచికి హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అహ్మద్ నదీంను GAD ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇంతకుముందు GAD లో ఉన్న రఘునందన రావును గనుల శాఖకు బదిలీ చేశారు.

రాహుల్ బజ్జాను విపత్తు నివారణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించారు. అదే సమయంలో BC సంక్షేమ శాఖ అదనపు బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు. కాత్యాయిని దేవిని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖకు స్పెషల్ CS గా నియమించారు.

GWMC కమిషనర్ T వెంకన్నను బదిలీ చేశారు. విద్యాసాగర్‌ను పర్యాటక శాఖ డైరెక్టర్‌గా నియమించారు. రెవెన్యూ శాఖలో పనిచేసిన చంద్రకలను HMDA జాయింట్ కమిషనర్‌గా నియమించారు. తెలంగాణ PCCF గా విజయ్ కుమార్‌ను నియమించారు.

జూన్ 30వ తేదీన మరికొందరు IAS అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త నియామకాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ స్థానికత కలిగిన IAS అధికారులకు కీలక పదవులు రాలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని IAS బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com