హైదరాబాద్ 25°C
అమరావతి 29°C
IST 3:52 PM
సోమవారం నవంబర్ 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం బ్రేకింగ్

తెలంగాణలో భారీ వర్ష హెచ్చరిక: ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో భారీ వర్ష హెచ్చరిక: ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

బంగాళాఖాతంలో కొత్త తుఫాను ఏర్పడింది. దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

చెన్నైకి సుమారు 630 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండంగా ఉన్న వ్యవస్థ తుఫానుగా బలపడింది. ఇది ఇవాళ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ, రేపు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్టులు జారీ అయ్యాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.

తుఫాను రేపు తీరం దాటనుంది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com