హైదరాబాద్ 30°C
అమరావతి 31°C
IST 2:59 PM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

సినిమాల్లో సాంప్రదాయం.. OTT సిరీస్‌లో బోల్డ్ గ్లామర్..!

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సినిమాల్లో సాంప్రదాయం.. OTT సిరీస్‌లో బోల్డ్ గ్లామర్..!
📷 Mikhail Nilov / Pexels
షేర్ కాపీ అయింది ✓

సిల్వర్ స్క్రీన్ పై ఎంతో పద్ధతిగా కనిపించే స్టార్ హీరోయిన్స్ OTT లో మాత్రం హద్దులు చెరిపేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ అంటూనే మునుపెన్నడూ లేని విధంగా వెబ్ సిరీస్ లో గ్లామర్ డోస్ తో టెంపరేచర్ పెంచేస్తున్నారు.

హోమ్లీ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే కీర్తి సురేష్ బాలీవుడ్ సిరీస్ అక్కలో నటనతో పాటు గ్లామర్ షో తోను అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా విడుదలైన ఆ సిరీస్ లో కాస్త డోస్ పెంచి నటించారు కీర్తి. అదే సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న రాధిక అప్టే నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ట్రీట్ తో కిక్ ఇస్తున్నారు.

తమన్నా కూడా జీ కర్ద లస్ట్ స్టోరీస్ 2 లాంటి సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. సమంత సైతం ది ఫ్యామిలీ మన్ 2 తో పాటు సిటాడల్ సిరీస్ లో తనలోని బోల్డ్ యాంగిల్ బయట పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు.

వెండితెరపై సెన్సార్ నిబంధనలతో గ్లామర్ షోకు పరిమితులు ఉంటాయి. కానీ OTT వరల్డ్ లో ఆ అడ్డుకట్ట లేకపోవడమే హీరోయిన్స్ బోల్డ్ స్టెప్స్ తీసుకుంటున్న కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. డిజిటల్ స్పేస్ లో ఉన్న స్వేచ్ఛను వాడుకుంటూ క్యారెక్టర్ కు న్యాయం చేయడానికి ఎంతటి ఇంటిమేట్ సీన్స్ చేయడానికైనా వెనకాడట్లేదు. మొత్తానికి ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే పరిమితమైన గ్లామర్ డోస్ ఇప్పుడు వెబ్ సిరీస్ల వైపు మళ్ళుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com