ఇరాన్ విషయంలో ట్రంప్ కీలక సమావేశాలు; దౌత్యానికే ప్రాధాన్యం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పీట్ హెక్సేత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌తో కీలక సమావేశాలు నిర్వహించారు. ఇరాన్‌పై తదుపరి చర్యలపై చర్చించినప్పటికీ, ట్రంప్ సైనిక దాడులకు ఆమోదం తెలపలేదు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, కొందరు రక్షణ అధికారులు ఇరాన్‌ను మరింత తీవ్రంగా దెబ్బతీయాలని, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి ‘ఫినిష్ ది జాబ్’ చేయాలని సూచించారు. అయితే, ట్రంప్ మాత్రం యుద్ధం వల్ల ఇరాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చలు దెబ్బతింటాయని భావించినట్లు సమాచారం. ఆయన అణు కార్యక్రమాన్ని చర్చల ద్వారా నియంత్రించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో, సైనిక చర్యల అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా, సరిహద్దుల్లో అమెరికా సైన్యాన్ని సిద్ధంగా ఉంచాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే లేదా అమెరికా బలగాలపై దాడి చేస్తే సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.
మరోవైపు, కతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. హార్మోస్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం పునరుద్ధరణ, 600 కోట్ల డాలర్ల ఫ్రీజ్ చేసిన నిధుల్లో కొంత విడుదల, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కార్యక్రమం విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మోస్ జలసంధిపై దృష్టి కేంద్రీకరించింది. భవిష్యత్తు చర్చల్లో ఈ అంశం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా, పరిస్థితులు మారితే సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్కత తాత్కాలికంగా తగ్గినట్లు కనిపించినా, చిన్న ఘర్షణ జరిగినా తిరిగి యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ భవిష్యత్తు నిర్ణయాల కోసం మరింత వేచి చూడక తప్పదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com