15 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: UAE నిర్ణయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం 15 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఆ వయసు పిల్లలు ఇకపై సోషల్ మీడియా అకౌంట్లు తెరవలేరు. ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, ఇండోనేషియా దేశాలు ఇప్పటికే 16 ఏళ్ళు దాటిన వారికే సోషల్ మీడియా అనుమతిస్తున్నాయి. మరో 10 నుండి 15 దేశాలు కూడా అదే విధంగా నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉన్నాయి.
పిల్లలు పొద్దంతా ఫోన్లలో రీల్స్ చూడడం, చదువులు పక్కన పెట్టడం, ఆటలు మరచిపోవడం, సరిగా నిద్రపోకపోవడం వంటి సమస్యలు పెరిగాయి. సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ చూసి పిల్లల మనసులపై చెడు ప్రభావం పడుతోంది. అజాగ్రత్తగా లింకులు తెరిస్తే సైబర్ నేరగాళ్ళు పిల్లలను మోసం చేస్తున్నారు. పిల్లల ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో చూసి కిడ్నాప్ కేసులు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు.
తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే పిల్లలు కూడా అనుకరిస్తారు. AI వాడడం వల్ల పిల్లలకు స్వంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోతోంది. పెద్దలు ఇంట్లో పిల్లల ఫోన్ వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com