తెలంగాణ

ఉప్పల్ బాలుపై వికారాబాద్‌లో కేసు నమోదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఉప్పల్ బాలుపై వికారాబాద్‌లో కేసు నమోదు
📷 Alotrobo / Pexels
షేర్ కాపీ అయింది ✓

వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో థార్ జీప్‌పై ప్రమాదకర విన్యాసాలు చేసిన ఉప్పల్ బాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పల్ బాలు, అతని అనుచరులు కలిసి థార్ జీప్ పైకప్పుపై కూర్చొని, వాహనంపై స్టంట్స్ చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి.

అనంతగిరిలో ఉన్న పద్మనాభస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఆలయానికి సమీపంలోనే ఈ ప్రమాదకర స్టంట్స్ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. కొండల్లో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ”నారోడు నా ఇష్టం అంటే కుదరదు“ అంటూ పోలీసులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ప్రమాదకర స్టంట్స్ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com