తెలంగాణ

మాదాపూర్ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వల్లూరి నేచర్స్ లెగసీ ఎగ్జిబిషన్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మాదాపూర్ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వల్లూరి నేచర్స్ లెగసీ ఎగ్జిబిషన్
📷 Satya Nandigam / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వల్లూరి ‘నేచర్స్ లెగసీ’ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు.

ఆర్కిటిక్ అరణ్యాలు, దక్షిణ అమెరికా, బోర్నియో వర్షారణ్యాలతో పాటు ప్రపంచంలోని దట్టమైన అడవుల్లో తీసిన 75 ఫోటోలు ఇందులో ప్రదర్శించారు. గత 16 ఏళ్లలో తీసిన ఈ ఫోటోలకు పలు అవార్డులు లభించాయని, డిఎఫ్ నుంచి ప్రత్యేక గుర్తింపు ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రా ఫౌండేషన్ కు డొనేట్ చేస్తామని వల్లూరి చెప్పారు.

వల్లూరి ప్రధానంగా చార్టెడ్ అకౌంటెంట్, ఓ కంపెనీ సీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం బెంగళూరు శివార్లలో చిన్న కెమెరాతో పక్షుల ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. క్రమంగా ఇంటర్నేషనల్ ట్రిప్పులు చేస్తూ, అరుదైన జంతుజాలం, పక్షులను కెమెరాలో బంధించారు. ఈ ప్రయాణంలో బయాలజిస్టులతో సంప్రదింపులు, ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లడం చేశారు.

తెలంగాణలో అమరాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్, సోమశిల, శ్రీశైలం ప్రాంతాల్లోని వన్యప్రాణులు, కామారెడ్డి దగ్గర జింకలు, మెదక్ కిన్నెరసానిలో అరుదైన పక్షులు, అమీన్‌పూర్ చెరువులో వలస పక్షులు వంటి వాటిపై ఫోటో ఆల్బం తయారు చేయాలని వల్లూరి సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com