నిడదవోలులో ఎర్రకాలువ వరద ముంపు: పలు కాలనీలు జలమయం
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎర్రకాలువ వరద నీరు పొంగిపొర్లుతోంది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
తీరుగూడెం, రాయిపేట, గాంధీనగర్, సుబ్బరాజుపేట, జగనన్న కాలనీలతో పాటు శివారు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తీరుగూడెంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సింగవరం సమీపంలో ఎర్రకాలువకు గండి పడింది. దీంతో అక్కడి కాలనీలు వరద నీటిలో మునిగాయి. ఎర్రకాలువ నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తీరుగూడెం నుంచి గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 108 వాహనం అక్కడికి వెళ్లలేకపోవడంతో ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక గర్భిణీ మహిళను చాటర్‌పై తీసుకొచ్చి, ఆ తర్వాత కాలినడకన తరలించినట్లు తెలిపారు.
తీరుగూడెం వద్ద వరద నీటిలో విషసర్పాలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com