హైదరాబాద్ 26°C
అమరావతి 32°C
IST 7:10 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

భద్రాచలం స్నాన ఘట్టాలు బురదమయం, శుభ్రం చేస్తున్న అధికారులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భద్రాచలం స్నాన ఘట్టాలు బురదమయం, శుభ్రం చేస్తున్న అధికారులు
📷 Ann H / Pexels
షేర్ కాపీ అయింది ✓

భద్రాచలం వద్ద గోదావరి నది వరద కారణంగా స్నాన ఘట్టాలు బురదమయం అయ్యాయి. 10 రోజుల క్రితం నీటి మట్టం 56 అడుగులకు పెరగగా, ప్రస్తుతం 20 అడుగుల మేర ప్రవహిస్తోంది.

వరద తగ్గడంతో స్నాన ఘట్టాల వద్ద ఒండ్రుమట్టి ఒక అడుగు లోతు వరకు పేరుకుపోయింది. భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా కొంత ప్రదేశాన్ని శుభ్రం చేశారు. మిగిలిన ప్రాంతంలో పెద్ద మోటార్ సాయంతో బురదను శుభ్రం చేస్తున్నారు.

ప్రస్తుతం తక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ఇబ్బంది లేదు. భక్తుల సంఖ్య పెరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com