గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పణతో హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ప్రారంభం
హైదరాబాద్‌లో ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం లంగర్ హౌస్‌లో బోనాల జాతర మ్యాగజైన్‌ను మంత్రులు ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా భక్తులు మట్టి కుండల్లోనే బోనం సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రులు తెలిపారు.
ఒక నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, తీన్‌మార్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com