అర్ణబ్ తుఫాను ప్రభావం: శ్రీకాకుళంలో భారీ వర్షాలు, రోడ్లు జలమయం
శ్రీకాకుళం జిల్లాలో అర్ణబ్ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి రోడ్లు జలమయమయ్యాయి.
జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్ స్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా నీట మునిగాయి. బస్సు దిగిన ప్రయాణికులకు మోకాలి లోతు వరకు నీరు ఉంది. కాంప్లెక్స్ లోకి ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
ఉద్దానం ప్రాంతంలో రైతులకు భారీ నష్టం జరిగింది. వందల ఎకరాల్లో జీడి, కొబ్బరి తోటలు నష్టపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పొట్ట దశలో ఉంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సముద్రతీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగసిపడుతున్నాయి. చెట్ల కింద, నీటి ప్రాంతాల్లో ఉండవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com