బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు జలాలయం నుంచి ఆలయార్చకులు వైదిక బృందం యాగశాలలో ప్రవేశించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.
శాంతి మంత్ర పఠనం, గణపతి పూజ, మండపారాధన, అగ్నిస్థాపన, వేద పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్థాపిత దేవత పూజ, నిరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, ధార్మిక ప్రవచనం జరుగనున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల చివరి రోజున మహాభిషేకం, అలంకరణ, రుద్ర స్వాహాకారం, బలి ప్రధానం, పూర్ణాహుతి వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయ ఈవో ఆంజనీ దేవి ఈ వివరాలు తెలిపారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారి మూలమంత్ర జపాలు, చండీ హోమం, ఉపనిషత్ పారాయణలు కూడా జరుగుతాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com