హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 8:37 AM
శుక్రవారం జూలై 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఇవాళ హర్యానాలో ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఇవాళ హర్యానాలో ప్రారంభం
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

భారతదేశపు తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన రైలు ఇవాళ హర్యానాలో ప్రారంభమవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జింద్-సోనిపత్ మార్గంలో దీన్ని ప్రారంభించనున్నారు.

ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. అంతకుముందు డీజిల్ ఇంజిన్ గా ఉన్న ఈ రైలును 1200 కిలోవాట్ల సామర్ధ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ తో అమర్చారు. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. వ్యర్థంగా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది, కాలుష్యం ఉండదు.

ఈ రైలుకు మొత్తం 10 కోచ్ లు ఉండి, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఒకేసారి 2600 మంది ప్రయాణించవచ్చు. టికెట్ ధరలు రూ.5 నుంచి గరిష్టంగా రూ.25 వరకు నిర్ణయించారు. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు.

జింద్ లో ప్రత్యేకంగా హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అన్ని భద్రతా పరీక్షలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్కూల్ విద్యార్థులతో కలిసి కొద్ది దూరం ప్రయాణించవచ్చని సమాచారం.

ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com