హైదరాబాద్ 28°C
అమరావతి 28°C
IST 5:00 PM
మంగళవారం నవంబర్ 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

కార్తీక మాసం నియమాలు: దానం, దీపం, స్నానానికి ప్రధాన్యత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కార్తీక మాసం నియమాలు: దానం, దీపం, స్నానానికి ప్రధాన్యత
📷 Lakshmi Raj / Pexels
షేర్ కాపీ అయింది ✓

కార్తీక మాసంలో దానం, దీపం, స్నానం అనే మూడు నియమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. సంప్రదాయ విశ్వాసం ప్రకారం ఈ మూడు ఆచారాలు ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి.

స్నానం విషయంలో బ్రహ్మీ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందే చేయాలని చెబుతారు. వీలైతే నదీ జలాల్లో స్నానం చేయాలి. శరత్ కాలంలో వచ్చే వెన్నెల, సూర్య కిరణాల ప్రభావంతో నదీ జలాలు ఔషధ గుణాలను పొందుతాయని వివరిస్తారు. ఈ జలాలను హంసోదకం అంటారు. అందుకే కార్తీక మాసంలో చేసే స్నానాన్ని హంసోదిక స్నానం అని కూడా పిలుస్తారు.

స్నానం చేసేటప్పుడు నడుము వరకు నీటిలో మునిగి స్నానం చేయడం మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల జీర్ణకోశం, ఉదర భాగానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని వివరణ ఉంది. చల్లని నీరు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని, మానసిక రుగ్మతలు తొలగుతాయని, శారీరక దృఢత్వం కలుగుతుందని చెబుతారు. నదీ స్నానం వీలుకాని వారు తాజా నీటితో స్నానం చేయవచ్చని సూచిస్తారు.

దీపానికి ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనెకు అధిపతి శని భగవానుడు. చలికాలంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల దాని వేడి, వాసన శ్వాసకోస సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని చెబుతారు. ఉభయ సంధ్యల్లోనూ దీపం వెలిగించడం, దీపాన్ని దానం చేయడం ఈ మాసంలో విశేషమని చెప్పబడింది.

ఉపవాసం మరో ముఖ్యమైన నియమం. కొందరు పాడ్యం నుంచి అమావాస్య వరకు నెల రోజులూ వ్రతంగా ఉపవాసం ఉంటారు. అలా చేయలేని వారు నక్తం లేదా ఏకభుక్తం చేయవచ్చు. కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, నాగుల చవితి రోజుల్లో ఉపవాసం ఉండడం శ్రేష్ఠమని చెబుతారు. ఈ మాసంలో తులసి, ఉసిరి ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com