హైదరాబాద్ 29°C
అమరావతి 35°C
IST 11:56 AM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

నరసంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం; మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడతామన్న కేటీఆర్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నరసంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం; మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడతామన్న కేటీఆర్
📷 Satya Nandigam / Pexels
షేర్ కాపీ అయింది ✓

వరంగల్ జిల్లా నరసంపేటలో మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

స్థానిక మెడికల్ కాలేజీ ఎదురుగా ఓ ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు BRS నాయకులు గద్దె నిర్మించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం దాన్ని మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. దీంతో ఆందోళన చెందిన BRS కార్యకర్తలు అదే ప్రదేశంలో మళ్లీ గద్దె కట్టి విగ్రహం నిలపాలని ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన గద్దె నిర్మించి విగ్రహావిష్కరణ చేశారు.

పెద్ది సంస్మరణ సభలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, "రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు నరసంపేటలో మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం" అని ప్రకటించారు. ఉద్యమంలో పెద్ది తనతో కలిసి ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన కుటుంబాన్ని పార్టీ తరపున ఆదుకుంటామని చెప్పారు. పెద్ది లేని సభలో పాల్గొంటామని కలలో కూడా అనుకోలేదని కేటీఆర్ భావోద్వేగంగా చెప్పారు.

ఈ విషయంపై ప్రభుత్వం స్పందన తెలియాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com