విశాఖపట్నం MGCRI జాతీయ క్యాన్సర్ ఆసుపత్రుల్లో 9వ స్థానంలో నిలిచింది
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (MGCRI) అవుట్‌లుక్ బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్ 2026లో దేశంలోని క్యాన్సర్ ఆసుపత్రుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్యాన్సర్ సంరక్షణ సంస్థల్లో ఇది మొదటి స్థానంలో ఉంది.
రోగి సంతృప్తి, సాంకేతికత అనుసరణ, వైద్యుల బృంద ప్రమాణాలు, క్లినికల్ ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్, ఆసుపత్రి పరిమాణం, టీచింగ్ హాస్పిటల్ హోదా వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్ నిర్ణయించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ సర్వే అవుట్‌లుక్ సంస్థ ప్రభుత్వ అనుమతితో 2026లో నిర్వహించినది.
20 సంవత్సరాల సేవ పూర్తి చేసుకున్న ఈ ఆసుపత్రి, ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా రోగులకు కుటుంబ సభ్యులతో సహా వైద్య సేవలందించింది. మెడికల్, సర్జికల్, రేడియేషన్, న్యూక్లియర్ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్ విభాగాలతో పాటు గ్రామీణ స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తూ, క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తున్నట్లు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com