విశాఖలో దీపావళి షాపింగ్ జోరు: AU గ్రౌండ్‌లో 200-300 క్రాకర్స్ స్టాళ్లు
విశాఖపట్నంలో దీపావళి సామాగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నగరంలోని AU ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోంది.
ఈ సారి ఇక్కడ సుమారు 200 నుంచి 300కి పైగా క్రాకర్స్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ధరలు అంతంత మాత్రమే ఉన్నాయని, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారని కొనుగోలుదారులు చెప్తున్నారు.
వ్యాపారులు మాట్లాడుతూ బిజినెస్ బాగానే ఉందని తెలిపారు. వాతావరణం అనుకూలించడంతో రద్దీ పెరిగిందని, వచ్చిన ప్రతి కస్టమర్ ఏదో ఒకటి కొంటున్నారని వారు చెప్పారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు కొంత తగ్గాయని తెలుస్తోంది. వరుసగా ఎన్నికలు జరగడం, తుఫాను ప్రభావం ఉండడం, దీపావళికి సమయం తక్కువగా ఉండడం కారణాలుగా చెబుతున్నారు. గత మూడు రోజుల నుంచి వ్యాపారం జరుగుతుండగా, పండగ రోజు కావడంతో కొనుగోలు పెరిగింది.
భారీ బాంబుల కంటే సాధారణ క్రాకర్స్ కొనుగోలు చేయాలని కొనుగోలుదారులు సూచిస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని వారు చెప్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com