శ్రీశైలంలో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదన
శ్రీశైలం దేవస్థానం లో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు లు శ్రీశైలంలో పరిపాలన భవనం నుంచి వైద్యశాల వరకు స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు రూ.125 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.
ఈ క్యూ కాంప్లెక్స్ లో ఒకేసారి 15 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని ఈ ప్రణాళిక రూపొందించారు.
ఒకవేళ ఒకే చోట తగినంత స్థలం లభించకపోతే, రెండు ప్రాంతాల్లో రెండు క్యూ కాంప్లెక్స్ లను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com