ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు ముగిసాయి
పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిసాయి.
ఉగాది రోజు ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి అంకంగా ఆదివారం అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ఒగ్గు పూజారులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున భక్తులు 'శరణు శరణు మల్లన్న' అంటూ నిప్పులపై నడిచి తమ భక్తిని ప్రదర్శించారు.
ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు బోనాలు, మొక్కులు సమర్పించుకున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com