హైదరాబాద్ 27°C
అమరావతి 27°C
IST 4:05 PM
బుధవారం అక్టోబర్ 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వ్యవసాయం

రబీ వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ: పూర్తి మార్గదర్శకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రబీ వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ: పూర్తి మార్గదర్శకం
📷 Vlada Karpovich / Pexels
షేర్ కాపీ అయింది ✓

నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తొలిదశ నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు.

విత్తన శుద్ధి: తెగుళ్లు రాకుండా కాపాడుకోవడానికి టెకోనజోల్ అనే మందును ఒక గ్రాము లేదా ఒక ml కిలో విత్తనానికి కలిపి ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకోవాలి. దీని వల్ల ఒక నెల రోజుల వరకు ఎలాంటి తెగుళ్లు రాకుండా కాపాడుకోవచ్చు.

వేరు పురుగు నివారణ: విత్తనాలు మొలకెత్తిన తర్వాత వేరు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. నివారణకు క్లోరోఫైరిఫాస్ మందును 7 నుండి 8 ml కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.

ఆకు గూడు పురుగు నివారణ: ఆకు జల్లెడ పురుగు లేదా ఆకు గూడు పురుగు కనపడినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాము లీటర్ నీటికి, వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు నివారణ: ఈ పురుగు ఆకు కింద 150 నుండి 200 గుడ్లు పెడుతుంది. లార్వాలు ఆకు పత్ర భాగమంతా తినేస్తాయి. నివారణకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, అరలీటర్ నుండి లీటర్ వరకు క్లోరోఫైరిఫాస్ కలిపి విషపు ఎరను సాయంత్రం పూట చల్లాలి. మూడు నాలుగు రోజులలో పురుగులు చనిపోతాయి.

మొవ్వు కుళ్లు మరియు కాండం కుళ్లు నివారణ: తామర పురుగు రసం పీల్చడం వల్ల మొవ్వు కుళ్లు మరియు కాండం కుళ్లు వస్తుంది. దీని నివారణకు థయోమెథాక్సామ్ అక్టారా మందును 0.5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఫంగస్ వల్ల కలిగే మొవ్వు కుళ్లు నివారణకు బ్లైటాక్స్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును అరకేజీ తీసుకొని 5 నుండి 10 కిలోల ఇసుక లేదా యూరియాతో కలిపి చల్లిన తర్వాత నీటి తడి ఇవ్వాలి. దీని వల్ల మొవ్వు కుళ్లు మరియు ఎండు తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com