తెలంగాణ

రేవంత్-వైష్ణవ్ భేటీ సానుకూలంగా ముగిసింది; రేపు పట్టణాభివృద్ధి మంత్రితో చర్చలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రేవంత్-వైష్ణవ్ భేటీ సానుకూలంగా ముగిసింది; రేపు పట్టణాభివృద్ధి మంత్రితో చర్చలు
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగాయి.

ఈ భేటీలో ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.13,600 కోట్ల రుణాల విడుదలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టుల నిధుల కేటాయింపుపైనా చర్చలు జరిగాయి. భేటీ సానుకూలంగా జరిగిందని, త్వరలో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గతంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు జపాన్ సంస్థ జేఐసీఏ నుంచి నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి వైష్ణవ్‌ను కలిసేందుకు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం అపాయింట్మెంట్ నిర్ణయమైంది.

రేవంత్ రెడ్డి రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. ఈ బేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ విస్తరణకు కేంద్ర వాట నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com