ఎన్టీఆర్‌ను కలవడంలో అడ్డంకులు: సాయి రూప్ ఆరోపణ
నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడానికి తనకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఫ్యాన్స్ కోఆర్డినేటర్ సాయి రూప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తనకు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక లీగల్ నోటీసు రాలేదని సాయి రూప్ తెలిపారు. కానీ ఓ లేఖ వచ్చిందని, అయితే దానిలోని నిజానిజాలపై తనకు అనుమానం ఉందన్నారు. నటుడి చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు వ్యక్తులు తన గురించి తప్పుడు సమాచారం చెప్పి ఆ లేఖ రాసిరంచారనే అనుమానం వ్యక్తం చేశారు.
2024 జనవరి 8న ‘దేవర’ సినిమా టీజర్ లాంచ్ తర్వాత ఓ ఫ్యాన్స్ కన్వీనర్ తనకు ఫోన్ చేసి ‘ఎన్టీఆర్ గారి అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’ అని చెప్పారని, అయితే ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదని సాయి రూప్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేరుగా చెప్పినా, ఆయన కార్యాలయం నుంచి అధికారికంగా తెలిపినా మాత్రమే తాను నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నటుడి చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com