సారేకళ్ళు కారగట్టులో మొబైల్ సిగ్నల్ లేక గ్రామస్తుల తిప్పలు
కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని సారేకళ్ళు కారగట్టు గ్రామంలో మొబైల్ సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ సిగ్నల్ కోసం గ్రామస్తులు తప్పనిసరిగా రెండు ఊర్ల మధ్యనున్న 'ముత్యాలమ్మ బోడు' అనే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తోంది.
ప్రభుత్వ ఉపాధ్యాయులు అటెండెన్స్ యాప్ వేసుకోవడం, రైతులు యూరియా బుకింగ్ చేసుకోవడం, కాలేజీ విద్యార్థులు ఆన్‌లైన్ అటెండెన్స్ నమోదు చేసుకోవడం వంటివి ఈ ప్రదేశానికి వచ్చి నిలబడినప్పుడే సాధ్యమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఐసీడీఎస్ సిబ్బంది, నిరుద్యోగులు నైపుణ్య శిక్షణ యాప్లు వినియోగించుకోలేకపోతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలన్నా బైక్ మీద ఆ ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు అంటున్నారు. నిత్యం ఇదే జంజాటం ఉండటంతో సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com