హైదరాబాద్ 24°C
అమరావతి 32°C
IST 7:45 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: హైదరాబాద్ సీటు కోసం బీజేపీలో లాబీయింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: హైదరాబాద్ సీటు కోసం బీజేపీలో లాబీయింగ్
📷 Gu Bra / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. మార్చి నాటికి ఖాళీ కానున్న రెండు స్థానాలకు అన్ని పార్టీలు వ్యూహరచన ప్రారంభించాయి.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి అవకాశం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చాలా మంది నాయకులు టికెట్ ఆశిస్తూ ఎవరికి వారే లాబీయింగ్ చేసుకుంటున్నారు.

వీరిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు, ప్రస్తుత ఎమ్మెల్సీ వాణిదేవి బంధువు అయిన ఎన్వి సుభాష్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వివిధ కారణాలతో టికెట్ నిరాకరించిన నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు అన్ని పార్టీల క్యాడర్‌తో తమకున్న సంబంధాలతో సులభంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.

ఇప్పటికే కొందరు నేతలు ‘పార్టీ పని చేయమని చెప్పింది’ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో టికెట్ ఎవరికి కేటాయిస్తారనే చర్చ తెలంగాణ బీజేపీలో జరుగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com