నాగార్జున సాగర్‌లో వరుణ యాగం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో వరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ యాగం చేపట్టారు.
సాగర్ తీరంలో విజయ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటలకు యాగం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితుల సూచనలతో 11 హోమ గుండాలు, 108 మంది రుత్వికులతో ఈ క్రతువు జరిగింది.
రాష్ట్ర మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఆయన సతీమణి యాగాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com