ప్రకాశం: పొదిలిలో పొగాకు రైతుల నిరసన – వేలం నిలిపివేత
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులు వేలం కేంద్రాల వద్ద నిరసన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం కేజీకి రూ.150 నుంచి రూ.200 మాత్రమే ధర లభిస్తోంది. పొగాకు బోర్డు అనుమతించిన పంటను సైతం వ్యాపారులు పూర్తిగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దాదాపు 75% పంట తక్కువ నాణ్యత (నోబిట్) గా ఉండడం, కూలీలు, కట్టెలు, బార్నింగ్ ఖర్చులు పెరగడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు.
సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల మధ్య పోటీ పెంచాలని, లేదంటే పోరాటం ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com