విశాఖలో మొదటి కోవిడ్-19 కేసు: 33 ఏళ్ల వ్యక్తి హోమ్ ఐసోలేషన్లో చికిత్స
విశాఖపట్నంలో కోవిడ్-19 మొదటి కేసు నమోదైంది. జ్వరం, వళ్ళు నొప్పులతో బాధపడుతున్న 33 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ప్రైవేట్ ల్యాబ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్)లలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఫలితం వచ్చింది.
ఆయన కలెక్టరేట్ సమీపంలోని కాలనీలో నివసిస్తున్నారు. వైద్యుల సూచనలతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పరివేక్షిస్తున్నారు.
ఈ కేసుపై డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు స్పందించారు. ఈ వేరియంట్ అతి ప్రమాదకరమైనది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి ఇటీవల విశాఖకు వచ్చిన ఆ వ్యక్తి సన్నిహితులను కూడా పరీక్షిస్తున్నారు. వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయేమోనని అనుమానిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వింశ ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం 18 ఐసోలేషన్ పడకలు సిద్ధం చేశారు. వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com