హైదరాబాద్ 31°C
అమరావతి 35°C
IST 10:56 AM
సోమవారం జూలై 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

సింగరేణి భరోసా యాత్ర ప్రారంభించిన బీజేపీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సింగరేణి భరోసా యాత్ర ప్రారంభించిన బీజేపీ
📷 Batthini Vinay Kumar Goud / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేటి నుండి రెండు రోజుల పాటు 'సింగరేణి భరోసా యాత్ర' నిర్వహిస్తోంది. కొత్తగూడెం నుంచి మందమరి వరకు ఈ యాత్ర సాగుతుంది.

తొలి రోజు భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి కార్మికులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమవుతారు. అనంతరం మణుగూరు సింగరేణి ఏరియాలోని పీకే-ఓసీపీ బొగ్గు బ్లాక్ను వారు సందర్శిస్తారు.

తాడిచర్ల రెండో బ్లాకును ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించింది. ఈ కేటాయింపుతో సింగరేణి నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. యాత్రలో డీకే అరుణతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com