తొమ్మిది, పది తరగతుల థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలపై CBSE కీలక నిర్ణయం
తొమ్మిది మరియు పది తరగతుల విద్యార్థుల థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలపై కొత్త విధి విధానాలను CBSE రూపొందించింది. ఇకనుంచి మూడవ భాష పేపర్‌కు బోర్డ్ పరీక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దాని స్థానంలో ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే నిర్వహించబడుతుందని తెలిపారు.
పదవ తరగతి పాస్ సర్టిఫికెట్ పొందాలంటే పాఠశాల నిర్వహించే థర్డ్ లాంగ్వేజ్ అంతర్గత పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులందరూ మూడు భాషలు చదవాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలనే నిబంధన విధించారు.
మూడో లాంగ్వేజ్ పేపర్‌కు విదేశీ లేదా నాన్ నేటివ్ భాషను ఎంచుకోవాలి. తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడతో పాటు ఇతర భాషలను భారతీయ భాషలుగా CBSE గుర్తించింది. విద్యార్థి ఇంటర్నల్ అసెస్మెంట్‌లో ఫెయిల్ అయినట్లయితే, ఫైనల్ ఫలితాలకు ముందే పాఠశాలలు రీ అసెస్మెంట్ అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.
ఎనిమిదవ తరగతిలో చదివిన మూడు భాషల కాంబినేషన్ తొమ్మిదవ తరగతిలోనూ కొనసాగుతుందని CBSE బోర్డ్ తెలిపింది. 2026-27 సంవత్సరంలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాత విధానమే వర్తిస్తుందని, వారికి మూడో భాష నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. కొత్త నిబంధనలు 2027-28లో పదవ తరగతికి వచ్చే బ్యాచ్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు మరియు పాఠశాలల సౌకర్యార్థం మూడవ లాంగ్వేజ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను NCERT వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com