తెలంగాణ: ఐదు జిల్లాల్లో ఉక్కపోత హెచ్చరిక, 28 జిల్లాల్లో బలమైన గాలులు
తెలంగాణలో రుతుపవనాలు బలహీనపడడంతో వర్షపాతం లోటు నెలకొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఐదు జిల్లాల్లో ఉక్కపోత హెచ్చరిక జారీ చేసింది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఇవాళ ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఐఎండి తెలిపింది. అదే సమయంలో 28 జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట 26 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
హనుమకొండ జిల్లాలో ఈ జులైలో 65% వర్షపాతం లోటు నమోదైంది. ఇటీవల నల్గొండలో గరిష్ట ఉష్ణోగ్రత 38.9 డిగ్రీలకు చేరుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్నప్పటికీ రుతుపవన ధ్రోణి రాష్ట్రంలో వర్షాలకు అనుకూలంగా లేదని నిపుణులు వివరించారు.
ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుంది. రానున్న మూడు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com