తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణలో రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ వర్షం పడవచ్చు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని IMD పేర్కొంది.
ఇప్పటికే సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ లోని బీంగల్ మండలంలో చాలా గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల లో వెల్గటూరు, ఎడపల్లి మండలాల్లో జోరు వాన పడింది.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు లేక పొడి వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం మాన్సూన్ ప్రభావంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగింది. ములుగు జిల్లా మల్లంపల్లిలో 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా దామెర, సూర్యాపేట జిల్లా మునగాలలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com