హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 2:41 PM
బుధవారం ఆగస్టు 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

కాకినాడ జిల్లాలో థార్ గ్యాంగ్ కదలికలపై పోలీసులు అప్రమత్తం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కాకినాడ జిల్లాలో థార్ గ్యాంగ్ కదలికలపై పోలీసులు అప్రమత్తం
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

కాకినాడ జిల్లాలో థార్ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ గ్యాంగ్ ఇటీవల రాజానగరం, ఏలూరు ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ ముఠా జగ్గంపేట పరిసరాల్లో మకాం వేసిందన్న సమాచారంతో నిఘా పెంచారు. దొంగల వద్ద ఆయుధాలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తుపాకులతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు.

ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా తుని, అన్నవరం, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ ప్రాంతాల్లో ఆర్మ్డ్ పార్టీలతో గస్తీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com