హైదరాబాద్ 26°C
అమరావతి 33°C
IST 10:15 AM
గురువారం ఆగస్టు 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

రాజేంద్రనగర్లో మైనర్ బాలికతో కారు నడిపించిన పోలీస్ అధికారి; స్థానికుల నిరసన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రాజేంద్రనగర్లో మైనర్ బాలికతో కారు నడిపించిన పోలీస్ అధికారి; స్థానికుల నిరసన
📷 Ieva Brinkmane / Pexels
షేర్ కాపీ అయింది ✓

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీస్ అధికారి ఒకరు తన మైనర్ మనమరాలిని కారు నడపడానికి అనుమతించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదర్ షాకోట్ నుంచి గంధం కూడా వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది. కారు నెమ్మదిగా, అస్తవ్యస్తంగా కదలడంతో స్థానికులు డ్రైవింగ్ సీట్లో ఉన్న మైనర్ బాలికను గుర్తించారు.

స్థానికులు ప్రశ్నించగా, ఆ బాలిక 'మా తాత పోలీస్' అని సమాధానం ఇచ్చింది. కారులో పక్క సీటులో ఉన్న పోలీస్ అధికారి స్థానికులతో దురుసుగా ప్రవర్తించాడని, ఆటోమేటిక్ కారు కాబట్టి తనకు కంట్రోల్ ఉందని వాదించినట్టు స్థానికులు తెలిపారు.

ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని మండిపడ్డారు. నియమాలు పాటించమని ప్రజలకు చెప్పాల్సిన పోలీసులే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని అంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పోలీస్ వర్గాల నుంచి ఇంకా స్పందన రాలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com